ETV Bharat / bharat

'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'

దిల్లీ ప్రజల సమక్షంలోనే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఫిబ్రవరి 16న జరిగే ఈ వేడుకకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది.

kejriwal oath
దిల్లీ ప్రజల సమక్షంలోనే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
author img

By

Published : Feb 13, 2020, 10:48 AM IST

Updated : Mar 1, 2020, 4:40 AM IST

'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హస్తిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 16న రాంలీలా మైదానంలో జరగనున్న ఈ మహోత్సవానికి రాజకీయ నేతలను కానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను గానీ ఆహ్వానించడం లేదని ఆప్​ విభాగం కన్వినర్ గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.

తన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన దిల్లీ ప్రజల మధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రమాణస్వీకార కార్యక్రమం దిల్లీకే ప్రత్యేకమని వెల్లడించారు.

"దిల్లీలో ప్రత్యేకంగా జరిగే ఈ ప్రమాణస్వీకార వేడుకకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులను ఆహ్వానించడం లేదు."

-గోపాల్ రాయ్, ఆప్ దిల్లీ కన్వినర్

ఇటీవల విడుదలైన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. 70 నియోజకవర్గాలకు గానూ 62 స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా 8 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

Last Updated : Mar 1, 2020, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.