ETV Bharat / bharat

పేదరిక సూచీని ఖరారు చేయనున్న నీతి ఆయోగ్​ - niti aayog news

కరోనా తెచ్చిన తంటాలతో ఆర్థిక పరిస్థితులు తలకిందులై, అనేక మంది ప్రజలు మళ్లీ పేదలుగా మారి ఉంటారనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని ఈ ఏడాది చివరినాటికి ఖరారు చేయనున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి రాష్ట్రాలు చేపట్టిన చర్యల్ని దీనికి ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ) మాదిరిగానే మన దేశ సూచీని రూపొందిస్తారు.

Niti Aayog to decide the poverty index
పేదరిక సూచీని ఖరారు చేయనున్న నీతి ఆయోగ్​
author img

By

Published : Aug 21, 2020, 9:45 AM IST

దేశంలో పేదరిక సూచీని ఖరారు చేసే ప్రక్రియను నీతి ఆయోగ్​ వేగవంతం చేయనుంది. కరోనా తెచ్చిన తంటాలతో ఆర్థిక పరిస్థితులు తలకిందులై, అనేక మంది ప్రజలు మళ్లీ పేదలుగా మారి ఉంటారనే ఆందోళన నెలకొంది. దాదాపు 40 కోట్ల మందిని ఈ మహమ్మారి పేదరికంలోకి నెట్టేసి ఉంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని ఈ ఏడాది చివరినాటికి ఖరారు చేయనున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి రాష్ట్రాలు చేపట్టిన చర్యల్ని దీనికి ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ) మాదిరిగానే మన దేశ సూచీని రూపొందిస్తారు.

'ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, ఆదాయ స్థాయి వంటి వాటిని కీలక ప్రామాణికాలుగా తీసుకుంటాం. పేదరిక నిర్మూలనకు రాష్ట్రాలు తగినన్ని చర్యలు చేపట్టేలా చూడడమే దీని లక్ష్యం. వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్​డీఏ) ప్రతినిధులనూ ఈ ప్రాామాణికాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేస్తాం. ఇది రెండు నెలల్లో పూర్తవుతుంది.' అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం మన దేశానికి అధికారికంగా పేదరిక రేఖ అనేది లేదు. 2009లో సురేష్​ తెందుల్కర్ కమిటీ, 2014లో వేర్వేరు ప్రామాణికాల ఆధారంగా పేదల సంఖ్యను అంచనా వేశాయి. ఆ తర్వాత తాజా అంచనాలు రూపొందలేదు.

ఇదీ చూడండి: ఆధిపత్య పరుగులో చైనా... ఆయుధ అన్వేషణలో భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.