జమ్ము కశ్మీర్‌లోని హజ్రత్బిల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సెలవులు ఇస్తున్నట్లు సంస్థ రిజిస్ట్రార్ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిట్‌లో బోధనా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా... విద్యార్థులంతా స్వస్థలాలకు పయనమయ్యారు.
"నిట్‌కు సెలవులు ప్రకటించినట్లు కళాశాల పాలక వర్గం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రతి విద్యార్థి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. రాష్ట్రేతర విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశారు. తిరిగి తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు."
- విద్యార్థి, హజ్రత్ బిల్ నిట్
ఖండించిన ప్రభుత్వం
హజ్రత్ బిల్ నిట్ తరగతులను నిలిపివేసినట్లు వచ్చిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ షాహిద్ చౌదరి ఈ మేరకు ట్విట్టర్లో ప్రకటన చేశారు. వదంతులను నమ్మవద్దని సూచించారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!