ETV Bharat / bharat

నిర్భయ కేసు: ముకేశ్​ పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా - undefined

Mumbai has started its new nightlife system and youths are loving it. Welcoming the move, youths said that its a great step for those people who work throughout the day and look for some refreshment at night. Home Minister Anil Deshmukh has said that if this experiment turns out to be successful, it will be implemented in Nagpur and Pune too.

nirbhaya case
నిర్భయ కేసు: 'రాష్ట్రపతి గురించి అలా ఎలా ఎంటారు?'
author img

By

Published : Jan 28, 2020, 2:35 PM IST

Updated : Feb 28, 2020, 7:04 AM IST

15:17 January 28

తీర్పు వాయిదా

నిర్భయ దోషి ముకేశ్​ పిటిషన్​కు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. 

15:06 January 28

ఈ కారణాలతో క్షమాభిక్ష పెడతారా?

దోషి ఆరోపిస్తున్నట్లు అతనిని ప్రత్యేక నిర్బంధంలో ఉంచలేదని కేంద్రం స్పష్టం చేసింది. జైలులో అతని పట్ల ప్రవర్తనను చూసి.. దారుణమైన నేరాలను పాల్పడినవారికి క్షమాభిక్ష ప్రసాదించలేరని తెలిపారు మెహతా. జైలులో ఉన్నప్పుడు ముకేశ్​ను లైంగిక వేధించారని అతని తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్​ చేసిన ఆరోపణలపై మెహతా ఈ విధంగా సమాధానమిచ్చారు. 

ఉరిశిక్ష పడినవారు అనారోగ్యంగా ఉన్నట్లయితే మరణ దండన విధించలేమని.. అయితే దోషి ఆరోగ్యంగానే ఉన్నట్లు కోర్టుకు తెలిపారు సొలిసిటర్​ జనరల్​.

14:57 January 28

కేంద్రం తరఫున తుషార్​ మెహతా వాదనలు

కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపిస్తున్నారు. 

"నిర్భయ కేసులకు సంబంధించిన అన్ని విచారణల్లో రాష్ట్రపతి పాల్గొనలేరు. క్షమాభిక్షకు సంబంధించి మాత్రమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. కేసులో ప్రతి విషయాన్ని, విచారణ జరిగిన పద్ధతిని పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని ప్రత్యేక కేసుల్లో న్యాయసమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుంది."

-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్​

క్షమాభిక్షకు సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కేంద్ర హోంశాఖ చేసిందని మెహతా తెలిపారు. ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడుతుందని మెహతా కోర్టుకు విన్నవించారు. 

14:26 January 28

నిర్భయ కేసు: 'రాష్ట్రపతి గురించి అలా ఎలా అంటారు?'

క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ కేసు దోషి ముఖేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రపతి సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని ఎలా ఆరోపిస్తారని దోషిని న్యాయస్థానం నిలదీసింది.

నిర్భయ కేసుకు సంబంధించిన వాస్తవాలను క్షమాభిక్ష పిటిషన్​తో పాటు రాష్ట్రపతి ముందు ఉంచలేదని ముఖేశ్​ తరఫు న్యాయవాది వాదించగా... మీరెలా చెప్పగలరని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్రపతి వద్దకు చేరాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో విధానపరమైన లోపాలున్నాయని ముఖేశ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. 
 
Intro:night life byte and visual

Body:.

Conclusion:.
Last Updated : Feb 28, 2020, 7:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.