దేశంలో వారసత్వ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ కుమారస్వామి... జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరోవైపు తమిళనాడులో స్టాలిన్.. తన కుమారుడు , సినీ హీరో ఉదయనిధిని డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు.
కన్నడ రాజకీయం...
కర్ణాటకలో జేడీఎస్ అధికారంలో ఉంది. ప్రస్తుతం కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ అధినేత దేవెగౌడ దేశ ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ... తన మనవడైన నిఖిల్ను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
ఆశ్చర్యపోయా...
తనను యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడంపై నిఖిల్ కుమారస్వామి ఆశ్చర్యానందం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సెలవిచ్చారు ఈ యువనేత.
తమిళ రాజకీయాలు..
డీఎంకే అధినేత స్టాలిన్ తన కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ను పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు.
డీఎంకేలో కరుణానిధిది ఓ శకం. ఆయన తను ఉండగానే వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కుమారులు అళగిరి, స్టాలిన్, కుమార్తె కనిమొళి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్.. తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తాజాగా కుమారుడికి డీఎంకే పార్టీలో కీలక పదవి అప్పగించారు.
ఇదీ చూడండి: పరువు నష్టం కేసులతో రాహుల్ బిజీబిజీ