ETV Bharat / bharat

హరియాణాలో నార్కో ఉగ్రవాది అరెస్టు - terror activities news

కరడుగట్టిన నార్కో ఉగ్రవాది రంజిత్‌ సింగ్​ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హరియాణాలో అరెస్టు చేసింది. అతడు భారత్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించి, వాటి ద్వారా వచ్చే సొమ్మును దేశ విద్రోహ కార్యకలాపాలకు మళ్లిస్తుంటాడని చెప్పారు అధికారులు.

NIA arrested narco terririst ranjit singh
హరియాణాలో నార్కో ఉగ్రవాది అరెస్టు
author img

By

Published : May 10, 2020, 6:39 AM IST

ఏడాదిగా భద్రతా సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ‘నార్కో ఉగ్రవాది’ రంజిత్‌ సింగ్​ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హరియాణాలో శనివారం అరెస్టు చేసింది. అతడు పాకిస్థాన్‌ ఉగ్రవాద ముఠాల తరఫున పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించేవాడని, వాటి ద్వారా వచ్చే సొమ్మును విద్రోహ కార్యకలాపాలకు మళ్లిస్తుంటాడని చెప్పారు.

రంజిత్‌ సింగ్‌ను చీతా అని కూడా పిలుస్తుంటారు. అతడి స్వస్థలం అమృత్‌సర్‌. నిఘా సమాచారం ఆధారంగా హరియాణాలోని సిర్సాలో నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో అతడిని పట్టుకున్నామని అధికారులు చెప్పారు. రంజిత్‌, మరో 15 మందిపైన, నాలుగు కంపెనీలపైన ఎన్‌ఐఏ గత ఏడాది జూన్‌లోనే తొలి అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. నాడు పాకిస్థాన్‌ నుంచి రాక్‌ సాల్ట్‌ ఖనిజం పేరుతో 532 కిలోల హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాన్ని భారత అధికారులు పట్టుకొని రంజిత్‌ సింగ్‌ సహా పలువురిని నిందితులుగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.