కేరళలో అమానవీయంగా పైనాపిల్లో బాంబుపెట్టి ఏనుగును చంపడంపై స్పందించింది జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్. ఏనుగు మృతిని సుమోటోగా స్వీకరించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని.. బాధ్యులపై తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కేరళ అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక అందించాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది ఎన్‌జీటీ సదరన్ బెంచ్.
ఘటనపై దర్యాప్తు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. వన్యప్రాణుల విభాగం సంరక్షణాధికారి, పాలక్కడ్ కలెక్టర్, డీఎఫ్‌వోకు ఆదేశాలు జారీ చేసింది.