ETV Bharat / bharat

లాక్​డౌన్​ పొడిగింపుపై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం: మోదీ

ఇన్ని రోజులు ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఫలితాలు మరో 3-4 వారాల్లో బయటపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ పొడిగింపుపై అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.

Next 3-4 weeks critical to determine impact of steps taken till now to curb spread of the virus: PM tells chief ministers
లాక్​డౌన్​ పొడిగింపుపై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం: మోదీ
author img

By

Published : Apr 11, 2020, 6:02 PM IST

కరోనాపై పోరులో రానున్న 3-4 వారాలు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇన్ని రోజులు చేపట్టిన చర్యలకు ఫలితాలు ఆ సమయానికి బయటపడతాయని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. లాక్​డౌన్​ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమించినందుకే దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించినట్టు పేర్కొన్నారు మోదీ. అయితే అలసత్వం చూపించకుండా నిఘాను కట్టుదిట్టం చేయడం ఎంతో ముఖ్యమన్నారు.

కరోనాపై పోరులో 'ఆరోగ్య సేతు' యాప్​ ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటించడానికి ఆరోగ్య సేతు యాప్​ ఈ-పాస్​గా వినియోగించే అవకాశముందన్నారు.

వైద్యుల రక్షణ పరికరాల కొరతపై మోదీ స్పందించారు. పీపీఈలతో పాటు అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

వ్యవసాయంపై...

ఈ సమావేశంలో వ్యవసాయంపై సుదీర్ఘంగా చర్చించారు. విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం అవసరమైతే చట్టాల్లో మార్పు చేయాలని సూచించారు. మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు.. ఇంటి వద్దకే వీటిని సరఫరా చేయడాన్ని పరిశీలించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.