ETV Bharat / bharat

పుట్టి ఆరు రోజులైంది.. అంతలోనే కరోనా సోకింది! - corona updates in telugu

కరోనాకు కాస్తైనా జాలి లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎవ్వరినీ వదలట్లేదు. తాజాగా గుజరాత్​లో ఆరు రోజుల కవల పిల్లలకు సోకిందీ మహమ్మారి.

Newborn twins become Gujarat's youngest coronavirus patients
పుట్టి ఆరు రోజులైంది.. అంతలోనే కరోనా సోకింది!
author img

By

Published : May 23, 2020, 12:23 PM IST

Updated : May 23, 2020, 1:01 PM IST

గుజరాత్​ మెహ్సానాలో ఆరు రోజుల కవలలకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

దాదాపు 93 కరోనా కేసులు నమోదైన మోలీపుర్ గ్రామాని​కి చెందిన ఓ గర్భిణికీ కరోనా సోకింది. నెలలు నిండి, మే 16న వాద్​నగర్​ ప్రభుత్వాసుపత్రిలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఓ ఆడబిడ్డ, ఓ మగబిడ్డ పుట్టినందుకు కుటుంబసభ్యులు సంతోషించారు. కానీ, ఆరు రోజులకే తల్లికి సోకిన ఆ మహమ్మారి ఆమె ద్వారా బిడ్డలకూ వ్యాపించిందని తేలింది.

ఇప్పటివరకు గుజరాత్​ రాష్ట్రంలోనే కరోనా సోకిన అతి పిన్న వయస్కులు ఈ కవలలేనని వైద్యులు వెల్లడించారు. పుట్టి వారం రోజులు కూడా కాకుండానే కంటికి కనబడని శత్రువుతో పోరాడుతున్న చిన్నారులు.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండి:ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మందిపై కేసు

Last Updated : May 23, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.