న్యాయవ్యవస్థలో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే. కోర్టుల్లో కృత్రిమ మేధస్సు వంటి అత్యున్నత సాంకేతికత వినియోగ అవసరం ఉందన్నారు.
దేశంలో తీర్పు వెలవరించే వ్యవస్థ మంచి స్థానంలో ఉందని అభిప్రాయపడ్డ ఆయన.. సాంకేతిక వినియోగం వంటి స్వల్ప మార్పులు అవసరమన్నారు.
"తీర్పు వెలువరించే వ్యవస్థ ఉన్నతంగా ఉంది. ఇందులో కృత్రిమ మేధ సాంకేతికత వినియోగం వంటి చిన్న చిన్న మార్పులు అవసరం. ఇది మంచి వ్యవస్థ. మరిన్ని ఇతర పద్ధతులను వినియోగించాల్సి ఉంది. న్యాయవ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు.. చట్టాలపై అవగాహన వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు, ఉన్నతమైన సిబ్బంది, సౌకర్యాల కల్పన వంటి స్వల్పకాలిక లక్ష్యాలు అవసరం."
- జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే.
ఇదీ చూడండి: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే