కనీస ఛార్జి రూ.130...
అత్యధిక నాణ్యత కలిగిన (హెచ్‌డీ), సాధారణ నాణ్యత కలిగిన (ఎస్‌డీ) ప్రసారాలకు వేర్వేరు ధరలు నిర్ణయించారు. వివిధ భాషలతో కలిపి ఉచిత ఛానళ్లు ప్రస్తుతం 534 అందుబాటులో ఉన్నాయి. 100 ఛానళ్ల వరకు రూ.130 తో పాటు జీఎస్‌టీ చెల్లించాలి. ఆపైన ఛానళ్లను బట్టి రేటు ఉండనుంది.
పేఛానళ్లు
ఇక నుంచి వీక్షించదలచిన మీడియా సంస్థ ఛానళ్లను ప్యాకేజీ కింద లేదా విడివిడిగా తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఒకవేళ ఛానల్ నచ్చకుంటే తొలగించుకునేందుకు వీలుంది. పే ఛానళ్ల ధరలు సాధారణంగా రూ.0.50 నుంచి రూ.19 వరకు ఉన్నాయి. కొన్ని సంస్థలు రూ.50 ఆపైన కూడా పేర్కొన్నాయి. ధరలు తక్కువగా ఉన్నప్పటికీ... చూడదలచిన ఛానల్‌ను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది.
ప్యాకేజీ గడువు వరకు కొనసాగింపు
డీటీహెచ్ ఆపరేటర్లు ప్రస్తుత ప్యాకేజీలు పునరుద్ధరించే గడువు వరకు కొనసాగించాలంటూ ట్రాయ్ ఇప్పటికే స్పష్టం చేసింది. డీటీహెచ్ సంస్థలు ఇష్టమైన ఛానళ్లతో కూడిన ప్యాకేజీ ఎంచుకోవాలంటూ సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది. జనవరి 31 వరకు వినియోగదారులు ప్యాకేజీకి బదులుగా తనకు ఇష్టమైన ఛానళ్లతో కూడిన సొంత ప్యాకేజీని ఎంపిక చేసుకునేందుకు ముందుకు వస్తే... ధరల్లో వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయాలని ట్రాయ్ తెలిపింది.