ETV Bharat / bharat

'హిందీ వివాదం'పై అమిత్​ షా వివరణ

హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్​షా చేసిన 'ఒకే దేశం- ఒకే భాష' వ్యాఖ్యలపై పలు పార్టీలు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో తన మాటలకు వివరణ ఇచ్చారు షా. మాతృ భాష అనంతరం రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే కోరానని తెలిపారు.

author img

By

Published : Sep 18, 2019, 10:55 PM IST

Updated : Oct 1, 2019, 3:25 AM IST

హిందీ వ్యాఖ్యలపై షా వివరణ-డీఎంకే ఆందోళన విరమణ

ఒకే దేశం- ఒకే భాష అంటూ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అనేక ప్రాంతీయ పార్టీలు షా వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తాను వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు షా. మాతృభాష తర్వాత రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే అభ్యర్థించినట్టు ఆయన స్పష్టం చేశారు. హిందీయేతర రాష్ట్రమైన గుజరాత్ నుంచే తానూ వచ్చానని గుర్తు చేసిన షా.. ఈ అంశంపై రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టమని పేర్కొన్నారు.

హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒకే దేశం-ఒకే భాష అనే విధానంతో హిందీ మాట్లాడాలని.. దీని ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని వ్యాఖ్యలు చేశారు షా.

"మాతృ భాష ద్వారానే పసి పిల్లల మానసికస్థితి పెరుగుతుంది. మాతృ భాషంటే హిందీ కాదు. ఆయా రాష్ట్రాల్లోని వారి ప్రాంతీయ భాషే మాతృభాష. కానీ దేశంలో ఒకే భాష ఉండాలి. ఎవరైనా మరో భాష నేర్చుకోవాలి అనుకుంటే అది హిందినే కావాలి. ఈ విషయమై నేను కేవలం అభ్యర్థించాను. దానిలో ఏం తప్పుందో అర్థం కావటం లేదు."

-అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

ప్రాంతీయ భాషలపై హిందీని బలవంతంగా రుద్దమని తాను ఎన్నడూ వ్యాఖ్యానించలేదని.. కావాలనే కొంతమంది ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని అమిత్‌ షా వెల్లడించారు.

'విజయం దక్కింది..'

ఈ వివాదంపై నిరసన తెలిపేందుకు.. సెప్టెంబర్​ 20న ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది తమిళ పార్టీ డీఎంకే. తాజాగా అమిత్​ షా ఇచ్చిన వివరణతో ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు.

"అమిత్​షా వివరణను డీఎంకేకు లభించిన విజయంగా భావిస్తున్నాం."

-ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు

ఎప్పుడు హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించినా డీఎంకే తప్పకుండా ఆందోళన చేపడుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: హిందీని బలవంతంగా రుద్దొద్దు: రజనీ

AP Video Delivery Log - 0900 GMT Horizons
Wednesday, 18 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0829: HZ Germany IFA Huawei AP Clients Only 4228598
Huawei debuts latest advanced chipset for smartphone ++REPLAY++
AP-APTN-0827: HZ UK Flying Fish Robot AP Clients Only 4230434
Flying fish could be used in hazardous areas
AP-APTN-0217: HZ Japan Anti Heat Hat AP Clients Only 4230408
Can a patented hat help with Japan's oppressive heat?
AP-APTN-0217: HZ China Salt AP Clients Only 4230407
Chinese challenge to reduce salt consumption
AP-APTN-1623: HZ France Fairy Tale Fashion AP Clients Only 4230429
Fairy tale frocks made from books, branches and blooms
AP-APTN-1300: HZ Spain Shoes and Brexit AP Clients Only 4230382
Spanish shoemakers concerned amid Brexit uncertainty
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 3:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.