ETV Bharat / bharat

'ఆ భూభాగాలు మావే.. నేపాలీలకు తిరిగే స్వేచ్ఛ ఉంది'

కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​ భూభాగాలు తమవేనని, ఆ ప్రాంతాల్లో తిరిగే స్వేచ్ఛ తమ దేశ ప్రజలకు ఉందని చెబుతోంది నేపాల్. చొరబాట్లు జరిగే అవకాశముందని ఉత్తరాఖండ్ ధార్​చులా సబ్​డివిజనల్​ మెజిస్ట్రేట్​ రాసిన ఓ లేఖకు నేపాల్ అధికారి ఈ విధంగా బదులిచ్చారు.

Nepal says its citizens free to travel to 'disputed' areas in Uttarakhand
'ఆ భూభాగాలు మావే.. నేపాలీలకు తిరిగే స్వేచ్ఛ ఉంది'
author img

By

Published : Aug 3, 2020, 12:59 PM IST

ఉత్తరాఖండ్​ ధార్​చులా సబ్​డివిజనల్​ మెజిస్ట్రేట్ రాసిన ఓ లేఖకు బదులిస్తూ.. వివాదాస్పద కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​ ప్రాంతాలు తమవేనని ప్రకటించుకుంది నేపాల్​. ఈ మూడు ప్రాంతాల్లో తమ దేశ ప్రజలకు తిరిగే స్వేచ్ఛ ఉందని తెలిపింది.

ధార్​చులా ఎస్​డీఎం అనిల్ శుక్లా... నేపాల్​లోని​ ధార్​చులా జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు. కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాల్లో పలు నేపాలీ​ సంస్థలు అక్రమ చొరబాట్లకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు.

దీనికి స్పందనగా '1816 సుగౌలి ఒప్పందం ప్రకారం ఈ మూడు ప్రాంతాలు నేపాల్​ భూభాగం కిందకే వస్తాయి. మా పౌరులకు అక్కడ పర్యటించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది' అని నేపాల్ అధికారి బదులిచ్చారు. ఈ లేఖను ట్విట్టర్​లో షేర్ చేసి అధికారిపై ప్రశంసలు కురిపించారు నేపాల్ మాజీ ఉప ప్రధాని కమల్​ థాప.

కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపే నూతన మ్యాప్​ను ఇటీవలే ఏకగ్రీవంగా ఆమోదించింది నేపాల్ పార్లమెంట్​. దీనిని భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇదీ చూడండి: చినాబ్​ నదిపై ఐఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన వంతెన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.