ETV Bharat / bharat

'21వ శతాబ్దానికి 'ఎన్​ఈపీ' దిక్సూచి లాంటిది'

author img

By

Published : Sep 11, 2020, 1:10 PM IST

నూతన జాతీయ విద్యావిధానం 21వ శతాబ్దానికి నూతన దిశను చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాఠశాల విద్యపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు మోదీ. పిల్లల నూతన విద్యాభ్యాసానికి 5 సూత్రాల మంత్రాన్ని సూచించారు.

PM Modi at conclave.
ఎన్​ఈపీ 21న శతాబ్దానికి నూతన దిశను చూపుతుంది: మోదీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్​ఈపీ 21వ శతాబ్దంలో విద్యారంగంలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 నూతన విద్యావిధానంలో పాఠశాల విద్యపై జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. కొత్త విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల నూతన విద్యాభ్యాసానికి 5 సూత్రాల మంత్రాన్ని సూచించారు.

" గత మూడు దశాబ్దాల్లో అనేక రంగాల్లో మార్పులు వచ్చినా విద్యా విధానంలో మాత్రం మార్పులు రాలేదు. పనిలో నిమగ్నం కావడం, శోధన, అనుభవం, భావ వ్యక్తీకరణ, ప్రతిభావంతులు కావటం అన్నవి పిల్లల నూతన విద్యాభ్యాసానికి మంత్రాలు అన్న విధానంలో ముందుకు సాగుతున్నాం. దేశ భవిష్యత్‌ నిర్మాణం యువతరం మీదే ఆధారపడి ఉంటుంది. అందులో వారి పాఠశాల విద్యది కీలక పాత్ర. అందుకే 2020-నూతన విద్యా విధానంలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కొత్త విద్యా విధానంపై 'మై గవ్' పోర్టల్‌లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే 15లక్షల సూచనలు, సలహాలు వచ్చాయని తెలిపారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత, ఒక్కో సంప్రదాయ కళ, పని విధానం ఉందన్నారు మోదీ. దానికి ఎంతో నైపుణ్యం కావాలని, ఆ ప్రాంతాల్లోని విద్యార్థులు వాటిని తెలుసుకుంటే ఆయా కళలతో బలమైన బంధం ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తులో ప్రాంతీయ ఉత్పత్తుల పరిశ్రమలోకి అడుగుపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు సిలబస్​ను తగ్గించి ప్రాథమిక అంశాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'ప్రపంచ అవసరాలకు తగ్గ నిపుణుల తయారీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.