జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్వహించిన పరీక్షలో దేశవ్యాప్తంగా 56.27 ఉత్తీర్ణత నమోదయింది. మొత్తం 7,97,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి నళిన్ ఖండేల్వాల్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. దిల్లీకి చెందిన భవిక్ బన్సాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ తర్వాత స్థానాల్లో నిలిచారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురిరెడ్డి ఏడో స్థానం కైవసం చేసుకుంది. ఏపీ విద్యార్థి ఖురేషి అస్రా 16వ ర్యాంకు సాధించింది. మొదటి 50 స్థానాల్లో నాలుగు ర్యాంకులను తెలుగు రాష్ట్రాలు సొంతం చేసుకున్నాయి.
మే 5, 20 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 14,10,755 మంది విద్యార్థులు హాజరయ్యారు. వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు భారత వైద్య మండలి, డెంటల్ కౌన్సిల్ ఆమోదం పొందిన కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.
ఇదీ చూడండి: జూన్ 15న నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం