ETV Bharat / bharat

షెడ్యూల్​ ప్రకారమే పరీక్షలు- శరవేగంగా ఏర్పాట్లు - కరోనా వైరస్​

కరోనా నిబంధనలను పాటిస్తూ.. జేఈఈ మెయిన్స్​, నీట్​ పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. షెడ్యూల్​ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మరోమారు స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని.. పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.

NEET, JEE on schedule, say officials; NTA prepares for safe conduct of exam amid COVID-19
షెడ్యూల్​ ప్రకారమే పరీక్షలు- శరవేగంగా ఏర్పాట్లు
author img

By

Published : Aug 26, 2020, 5:30 AM IST

షెడ్యూల్​ ప్రకారమే జేఈఈ మెయిన్స్​, నీట్​ పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

కరోనా సంక్షోభం వేళ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ పేర్కొంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్టు, గదిలో తక్కువ మంది అభ్యర్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

"జేఈఈ మెయిన్స్​ కోసం దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కు పెంచాం. నీట్​ కోసం పరీక్షా కేంద్రాలను 2,546 నుంచి 3,843కి పెంచాం. మెయిన్స్​ కంప్యూటర్​ ఆధారిత పరీక్ష కాగా.. నీట్​కు పెన్​-పేపర్​ అవసరం. నీట్​ కోసం ఒక గదిలో 24మంది బదులు 12మంది మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల బయట అభ్యర్థులు నిల్చునే సమయంలోనూ భౌతిక దూరాన్ని పాటించేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాం."

---నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ.

సెప్టెంబర్​ 1 నుంచి 6వరకు జేఈఈ మెయిన్స్​ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. నీట్​ సెప్టెంబర్​ 13న నిర్వహించనున్నారు.

పరీక్షలు వద్దు...

ఓవైపు పరీక్షలను నిర్వహించడానికి శరవేగంగా పనులు జరుగుతున్న తరుణంలో.. వాటిని రద్దు చేయాలన్న వాదనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరీక్షలు నిర్వహించకూడదని ఇప్పటికే కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ఈ జాబితాలోకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ చేరారు.

విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​కు రాసిన లేఖలో.. పరీక్షల వాయిదాకు డిమాండ్​ చేశారు నవీన్​ పట్నాయక్​. భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు నిర్వహచడం జరిగే పనికాదన్నారు.

అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను వాయిదా వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు దీదీ.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.