ETV Bharat / bharat

'అందుకు వేగవంతమైన టీకా పంపిణీ డ్రైవ్​​ అవసరం' - డాక్టర్​ హర్షవర్ధన్

దేశంలో తొలిదశలో 30 కోట్ల మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగవంతమైన వ్యాక్సిన్​ పంపిణీ డ్రైవ్​ అవసరమని నొక్కి చెప్పారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. కొవిడ్​-19పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం సమావేశం సందర్భంగా ఈ మేరకు సూచించారు.

Hardha Vardhan
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
author img

By

Published : Dec 19, 2020, 5:55 PM IST

Updated : Dec 19, 2020, 10:33 PM IST

దేశంలో 30 కోట్ల మందికి టీకా అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగవంతమైన కొవిడ్-19​ వ్యాక్సిన్​ పంపిణీ డ్రైవ్​ అవసరమన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​.

శనివారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన కొవిడ్​-19పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం 22వ భేటీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి. దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్​ దాటిన రోజునే ఈ సమావేశం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"భారత్​లో కొవిడ్​ మహమ్మారి వ్యాప్తి 2శాతానికి పడిపోయింది. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.45 శాతంగా ఉంది. రికవరీ రేటు 95.46 శాతానికి చేరింది. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించాలి. తొలి దశలో లక్ష్యంగా పెట్టుకున్న 30 కోట్ల మందికి పూర్తి స్థాయిలో అందించేందుకు వేగవంతమైన టీకా పంపిణీ వ్యవస్థ అవసరం. "

- డాక్టర్​ హర్షవర్ధన్​, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.

ఈ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జైశంకర్​, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ ఎస్​ పూరి, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్​ చౌబే, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్​ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానలపై చర్చించారు.

ఇదీ చూడండి:దేశంలో కోటి మార్కును దాటిన కరోనా కేసులు

Last Updated : Dec 19, 2020, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.