అసోంలోని 24 జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 950 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. వందలాది ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 85,546 హెక్టార్ల పంట భూమి నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 18 జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వరదల కారణంగా దాదాపు 8 లక్షలకుపైగా పెంపుడు జంతువులు, 4.24 లక్షలకు పైగా పౌల్ట్రీలు ప్రభావితమయ్యాయి.
శిబిరాలకు తరలింపు..
వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది అధికార యంత్రాంగం. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తలించేందుకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారికి నిత్యవసరాలను అందజేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ మాస్క్లు పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే: కేంద్రం