కోడె దూడలు కాకుండా కేవలం ఆడ దూడలే పుట్టేలా సరికొత్త సాంకేతికతను జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్డీడీబీ) తీర్చిదిద్దింది. క్షేత్రస్థాయిలో దీనిని పరిశీలించినప్పుడు ప్రోత్సాహకరమైన ఫలితాలు లభించాయని, తమిళనాడులో ఇటీవల ఈ సాంకేతికతతో మొదటి ఆవుదూడ పుట్టిందని ఎన్డీడీబీ తెలిపింది.
ఈ సాంకేతికత దేశంలోని పాడి రైతులందరికీ అందుబాటులోనే ఉంటుందని ఎన్డీడీబీ అధ్యక్షుడు దిలీప్ రథ్ తెలిపారు. ఆవుదూడలే పుట్టేలా విభజించిన వీర్యాన్ని ఉపయోగించి కృత్రిమ గర్భధారణ జరిపేందుకు ప్రస్తుతం అవుతున్న రూ. 1000 వ్యయం ఇకపై తగ్గిపోతుందని చెప్పారు. వాణిజ్య ప్రాతిపదికన 2021 జనవరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: నౌకాయాన శాఖ పేరు మారింది.. ఇకపై ఇలానే..