ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. మావోయిస్టు మృతి

ఛత్తీస్​గఢ్ దంతేవాడ జిల్లాలో భద్రతా దళాలకు నక్సల్స్​కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతుడిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Naxal killed in encounter with police in Chhattisgarh
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. మవోయిస్టు మృతి
author img

By

Published : Jun 2, 2020, 12:31 PM IST

Updated : Jun 2, 2020, 1:15 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్​ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అతడిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.

హురేపాల్​, బెచాపల్​ లోయ మధ్యలో మంగళవారం ఉదయం రిజర్వ్​ గార్డ్స్​, ప్రత్యేక టాస్క్​​ ఫోర్స్​ కూంబింగ్​ చేపట్టిన నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం వారు దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన స్థలంలో చనిపోయిన మావోయిస్టు దుస్తులు దొరికినట్లు దంతేవాడా ఎస్​పీ పల్లవ తెలిపారు.

చనిపోయిన మవోయిస్టును దాస్రు పునేమ్‌గా గుర్తించారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు'

Last Updated : Jun 2, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.