ప్రతిఘటిస్తాం
"భారత నావికా దళంలో అత్యంత ముఖ్యమైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు, మిగతా యుద్ధ నౌకలు, యుద్ధవిమానాలను మోహరించాం. అండమాన్ నికోబార్ దీవుల్లో జరగిన యుద్ధ విన్యాసాల కార్యక్రమం 'ట్రొపెక్స్ 19' నుంచి అవసరమైన నౌకలు, జలాంతర్గాములను తరలించాం. జనవరి 19 నుంచి మార్చి 10 వరకు ఈ కార్యక్రమం ఉన్నా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం."
-కెప్టెన్ డీకే శర్మ, నౌకాదళ అధికార ప్రతినిధి
సర్వం సిద్ధం
అన్ని దిశల్లోనూ భారత నౌకా దళం అప్రమత్తంగా ఉంది. మక్రాన్ తీరానికి మాత్రమే పాక్ పరిమితమయ్యేలా భారత్ చర్యలు తీసుకుందని, అంతర్జాతీయ జలాల్లోకి వచ్చే సాహసం ఆ దేశం చేయలేదని శర్మ వివరించారు. ఫిబ్రవరి 26 తర్వాత నౌకాదళం భారీ స్థాయిలో కసరత్తులు చేసింది. అన్ని విభాగాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమాండర్లందరికీ నౌకా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లంబా ఆదేశాలు జారీ చేశారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం 12 రోజులకు బాలాకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా తర్వాతి రోజే భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలతో దాడులకు ప్రయత్నించింది.
ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా