ETV Bharat / bharat

"అస్థిరతే వారి లక్ష్యం"

ఉగ్రదాడుల వెనుక పొరుగు దేశ హస్తముందన్నారు భారత నావికాదశ చీఫ్​ అడ్మిరల్​ సునీల్​ లంబా. దిల్లీలో జరుగుతోన్న భారత్​-పసిఫిక్​ రక్షణ రంగ సదస్సులో పాక్​నుద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సునీల్​ లంబా
author img

By

Published : Mar 5, 2019, 1:10 PM IST

పుల్వామా ఉగ్రదాడి వెనుక భారత అస్థిరతను కోరుకునే దేశమే ఉందని భారత నావికాదళ చీఫ్​ అడ్మిరల్​ సునీల్​ లంబా అన్నారు. దిల్లీలో జరుగుతున్న ఇండో-పసిఫిక్​ రక్షణ రంగ నిపుణుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో చాలాదేశాలు తీవ్రవాద రక్కసి బారిన పడుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాదం రూపుమార్చుకొని కొత్త తరహా దాడులతో విజృంభిస్తోందని లంబా పేర్కొన్నారు. ఉగ్ర భూతానికి భారత్​ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు వారాల క్రితం జమ్ము-కశ్మీర్​లో భారత జవాన్ల వాహన శ్రేణిపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ కుట్ర వెనుక భారత దేశ అస్థిరత కోరుకునే దేశం హస్తముంది. కొత్త తరహా దాడుల కోసం ఉగ్ర సంస్థలు ఆధునిక శిక్షణ నిర్వహిస్తోన్నట్లు మా వద్ద నివేదికలున్నాయి.- సునీల్​ లంబా,చీఫ్​ అడ్మిరల్​- భారత నావికాదళం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.