ETV Bharat / bharat

దేశంలో 25 వేలకు చేరువైన కరోనా కేసులు - కరోనా లేటెస్ట్ అప్​డేట్స్​

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 25 వేలకు చేరింది. 24 గంటల వ్యవధిలో 56 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్త కేసుల వృద్ధి 6 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.

coronavirus
కరోనా
author img

By

Published : Apr 26, 2020, 5:14 AM IST

Updated : Apr 26, 2020, 6:42 AM IST

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 25 వేలకు చేరువైంది. అయితే కొత్త కేసుల సంఖ్యలో వృద్ధి 6 శాతానికి తగ్గినట్లు కేంద్రం తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం మధ్య కాలంలో 56 మంది మరణించినట్లు వెల్లడించింది.

భారత్​లో 24 గంటల వ్యవధిలో సంభవించిన అత్యధిక మరణాలు ఇవేనని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 779కి చేరినట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.

coronavirus
దేశంలో 25 వేలకు చేరువైన కరోనా కేసులు

'మహా' కరోనా

మహారాష్ట్రలో ఒక్క రోజులో ఏకంగా 811 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో అత్యధిక కేసులు ఇవే కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,628కి చేరింది. శనివారం 22 మంది బాధితులు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 323కి పెరిగింది.

మరోవైపు లాక్​డౌన్ కాలంలో 15 మంది పోలీసు అధికారులు సహా మొత్తం 96 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ముగ్గురు పోలీసు అధికారులు, నలుగురు సిబ్బంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు స్పష్టం చేశారు.

గుజరాత్​లో

గుజరాత్​లో కొత్తగా 256 కేసులు నమోదుకాగా.. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 3,071కి చేరింది. శనివారం ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 133 మంది వైరస్ కారణంగా మరణించినట్లు స్పష్టం చేశారు.

దిల్లీలో

దేశ రాజధానిలో కరోనా కలవరపెడుతోంది. కొత్తగా 111 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు దిల్లీ యంత్రాంగం ప్రకటించింది. ఒకరు మరణించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,625కి చేరగా.. మృతుల సంఖ్య 54గా ఉంది.

ప్లాస్మాకు సై

కరోనా బాధితులకు నిర్వహిస్తున్న ప్లాస్మా థెరపీతో ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక సైతం ఇదే తరహా ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ట్రయల్స్ నిర్వహించడానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: రూ.లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి: సోనియా

Last Updated : Apr 26, 2020, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.