కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్ (74) మృతికి సంతాప సూచకంగా ఇవాళ దిల్లీలోని రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సహా రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాలను అవనతం(జెండాను కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటివద్ద భౌతికకాయం..
ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం పాసవాన్ భౌతికకాయాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అధికారిక లాంఛనాలతో నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: దళిత దిగ్గజ నేత 'పాసవాన్' కన్నుమూత