కోల్కతాలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసులో పలువురు తృణమూల్ నేతలకు సమన్లు జారీ చేసింది సీబీఐ. బంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ, ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్, కోల్కతా మాజీ మేయర్, ప్రస్తుతం భాజపాలో ఉన్న సోవన్ ఛటర్జీ సహా 10 మంది నేతలకు సమన్లు జారీ చేసింది.
విచారణకు లోక్సభ స్పీకర్ అనుమతి
ఈ కేసులో ఒక మాజీ సహా ముగ్గురు తాజా ఎంపీలు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను ఆశ్రయించింది సీబీఐ. ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంపీలు సౌగత రాయ్, కకోలీ ఘోష్, ప్రసూన్ బెనర్జీ, మాజీ ఎంపీ సువేందు ముఖర్జీలను విచారించేందుకు సీబీఐకి అనుమతించారు స్పీకర్.
ముగ్గురు నేతలు రూ. 5 లక్షలు... ఒక నేత రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్ వీడియోల్లో కనిపించారని పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటివరకు 12 మంది తృణమూల్ నేతలు, ఓ ఐపీఎస్ అధికారిపై కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: కశ్మీరే ప్రధాన విదేశీ అజెండా: పాకిస్థాన్