ETV Bharat / bharat

సుష్మ​ను గుర్తు చేసుకొని వెంకయ్య భావోద్వేగ​ ట్వీట్​ - vice president tweet

దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్​ను రక్షా బంధన్ రోజున గుర్తు చేసుకున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తన సోదరి లేని లోటు తెలుస్తోందని భావోద్వేగ ట్వీట్​ చేశారు.

Naidu's emotional Raksha Bandhan tweet on Sushma Swaraj
సుష్మా స్వరాజ్​ను గుర్తు చేసుకొని వెంకయ్య భావోద్వేగ​ ట్వీట్​
author img

By

Published : Aug 3, 2020, 8:44 PM IST

భాజపా దివంగత నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్​ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రక్షా బంధన్​ రోజు తన సోదరి లేని లోటు తెలుస్తోందని ట్వీట్ చేశారు. గతంలో ఆమె రాఖీ కట్టిన ఫొటోను షేర్​ చేశారు.

వెంకయ్య షేర్​ చేసిన ఫొటోను సుష్మా స్వరాజ్​ కూతురు బాంసురి స్వరాజ్ కూడా పోస్ట్ చేశారు. ఒక తీపి జ్ఞాపకమని అన్నారు.

బాంసురి స్వరాజ్​కు వెంకయ్య ఫోన్​ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వెంకయ్య సతీమణి ఉష.. బాంసురికి చీరతో పాటు కానుకలు పంపినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమను చూస్తుంటే తన తల్లి తిరిగివచ్చిన భావన కలుగుతోందని బాంసురి స్వరాజ్​ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: భారత్​ దూకుడు- చైనా సరిహద్దుకు భారీ ట్యాంకర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.