పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జులై 7 నుంచి 18 మధ్య సైన్యం జరిపిన వరుస పరీక్షల్లో నాగ్ విజయం సాధించింది.
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్లో నాగ్... 3వ తరానికి చెందింది. 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని శత్రు యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న నాగ్ 8 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2 సిద్ధం... ఈ నెల 22న ప్రయోగం