భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్పీఎఫ్ బలగాలకు చెందిన కమాండోస్తో జెడ్ కేటగిరి కల్పిసున్నట్లు తెలిపింది. నడ్డాకు ప్రాణహాని ఉందన్న కారణంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకునన్నట్లు వెల్లడించింది.
ఇకపై 35 మంది సీఆర్పీఎఫ్ కమాండోస్ నడ్డాకు 24గంటల పాటు రక్షణ కల్పిస్తారు. దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించిన దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన బృందం నిత్యం ఆయన వెంట ఉంటారు.
ఇదీ చూడండి : 'దేశంలో గణనీయంగా తగ్గిన అంధత్వ సమస్య'