ETV Bharat / bharat

ఆరెస్సెస్​ ప్రచారక్​... హరియాణాకు రెండోసారి సీఎం - మనోహర్​ లాల్​ ఖట్టర్

మనోహర్​ లాల్​ ఖట్టర్​... 60 ఏళ్ల వయస్సులో తొలిసారి భాజపా తరఫున 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండో సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించారు. 14 సంవత్సరాలు ఆర్​ఎస్సెస్​ ప్రచారక్​గా పనిచేసిన ఖట్టర్​ అవివాహితుడు. తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలిచి... సీఎం అయిన ఘనుడు.

ఆరెస్సెస్​ ప్రచారక్​... హరియాణాకు రెండోసారి సీఎం
author img

By

Published : Oct 27, 2019, 11:07 AM IST

Updated : Oct 27, 2019, 2:22 PM IST

హరియాణాకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్​ లాల్​ ఖట్టర్​ 1954లో రోహ్​తక్​లోని బనియానీలో జన్మించారు. రోహ్​తక్​లోనే మెట్రిక్యులేషన్​ పూర్తి చేశారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్​ డిగ్రీ అందుకున్నారు.

రాజకీయ జీవితం...

1977లో రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​(ఆరెస్సెస్​)లో చేరారు ఖట్టర్​. మూడేళ్ల అనంతరం.. పూర్తి స్థాయి ప్రచారక్​గా మారిన ఆయన.. అలాగే 14 సంతవత్సరాల పాటు కొనసాగారు. దానికి కట్టుబడి జీవితకాలం బ్రహ్మచారిగానే ఉన్నారు.

2000 నుంచి 2014 వరకు ఖట్టర్​... హరియాణా భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014 లోక్​సభ ఎన్నికల కోసం రాష్ట్ర భాజపా విభాగ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్​గా నియమితులయ్యారు. అనంతరం.. భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఆయనకు స్థానం లభించింది.

తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ.. విజయం...

2014 హరియాణా ఎన్నికల్లో కర్నాల్​​ నియోజకవర్గం నుంచి ఖట్టర్​... ఎమ్మెల్యేగా గెలిచారు. ఖట్టర్​ కర్నాల్​ స్థానికుడు కాదని... ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంలో విమర్శించినా మోదీ అనుకూల పవనాల తాకిడికి కొట్టుకుపోయాయి. ఆయనకు విజయం కట్టబెట్టాయి.

హరియాణాలో తొలిసారిగా భాజపా ఆధిక్యంలో నిలిచింది. అధికారంలోకి వచ్చింది. ఖట్టర్​ను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించింది అధిష్ఠానం. అలా... భాజపా తరఫున హరియాణా తొలి సీఎంగా ఖట్టర్​ సేవలందించారు.

సొంత వాహనమూ లేదు...

ఇటీవల ఎన్నికల్లో కర్నాల్​ అసెంబ్లీ స్థానానికి నామినేషన్​ దాఖలు చేసిన సందర్భంలో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 1.27 కోట్లుగా పేర్కొన్న ఆయన... చేతిలో కేవలం 15 వేల రూపాయలే ఉన్నాయని తెలిపారు. సొంత వాహనం కూడా లేదంట.
ఇప్పుడు రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన... మరో ఐదేళ్లు సేవలందించనున్నారు.

వివాదాలు...

మనోహర్​లాల్​ ఖట్టర్ కొన్ని సార్లు నోరు జారారు. ఓ సారి బహిరంగ సభలో స్వతంత్య్ర సమరయోధుడు మంగళ్​పాండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తప్పుతో స్వాతంత్ర్యం 90 ఏళ్లు ఆలస్యమైందని అన్నారు.

మరోసారి రుణమాఫీ వంటి పథకాలతో రైతులు బద్దకస్తులుగా తయారవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జమ్ముకశ్మీర్​కు కేంద్రం స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన అనంతరం.. ఇక అక్కడి ​ అమ్మాయిలను హరియాణా యువకులు పెళ్లి చేసుకోవచ్చని బహిరంగంగా ప్రసంగించి సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యారు.

ఇదీ చూడండి: హరియాణా సీఎంగా రెండోసారి ఖట్టర్..నేడే ప్రమాణం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sonoma County, California - 26 October 2019
1. Various of wildfire, rising smoke
2. Pan from raging fires to firefighters
3. Firefighters carrying hose near fire, pan
4. Wide of fire, smoke
STORYLINE:
Firefighters worked to contain wildfires across Northern California as authorities switched off power supply to almost 1 million customers in the state.
Strong winds on Saturday forced Pacific Gas & Electric to cut electricity supply to 940,000 customers over concern that gusts could down power lines and spark fires in the wine growing region.
In Sonoma County, 50,000 people were told to evacuate before expected wind speeds of up to 85 mph (137 kph) on Saturday night.
Earlier in the day, Cal Fire said the county's Kincade Fire had burned 49 buildings, consumed nearly 40 square miles (104 square kilometres) of dry brush and timber and was 10% contained.
Meanwhile, in Southern California, authorities lifted more evacuations as lessening winds allow crews get a handle on a wildfire near suburbs north of Los Angeles.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 27, 2019, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.