ఐపీఎస్ అధికారినంటూ వేషం వేసి గుజరాత్ వ్యాపారస్థుడిని మోసం చేసిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన ఎస్ఎస్ శర్మగా గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.
గుజరాత్ సూరత్‌కు చెందిన వ్యాపారస్థుడిని ఓ పని కోసం సంప్రదించాడు ఎస్ఎస్ శర్మ. తాను ఐపీఎస్ అధికారినని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్త్ర సరుకును ముంబయి ఓడరేవు నుంచి తీసుకురావాలని తెలిపాడు. ఈ మాటలు నమ్మిన వ్యాపారస్థుడు ముంబయి వెళ్లాడు. ఆ తర్వాత అతడిని అపహరించి సూరత్‌కు తీసుకెళ్లాడు నకిలీ ఐపీఎస్ అధికారి. వ్యాపారస్థుడి వద్ద నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ సహా రూ.15లక్షల నగదు వసూలు చేసి పారిపోయాడు.
తాను మోసపోయానని తెలుసుకున్న వ్యాపారస్థుడు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి అక్టోబర్ 13 వరకు రిమాండ్ విధించింది.