కరోనా ఔషధం పేరిట దేశీయ ఆయుర్వేద సంస్థ పతంజలి తీసుకొచ్చిన 'కరోనిల్' మందు అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.
ఈ ఔషధం నకిలీదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. పతంజలి అసలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందో లేదో జైపుర్ నిమ్స్ నిగ్గు తేల్చుతుందని ట్వీట్ చేశారు. నకిలీ మందుల అమ్మకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించదంటూ రాందేవ్ బాబాను హెచ్చరించారు.
-
The National Institute of Medical Sciences, Jaipur will find out whether clinical trials of @PypAyurved's 'Coronil' were done at all. An abundant warning to @yogrishiramdev that Maharashtra won't allow sale of spurious medicines. #MaharashtraGovtCares#NoPlayingWithLives
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The National Institute of Medical Sciences, Jaipur will find out whether clinical trials of @PypAyurved's 'Coronil' were done at all. An abundant warning to @yogrishiramdev that Maharashtra won't allow sale of spurious medicines. #MaharashtraGovtCares#NoPlayingWithLives
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 24, 2020The National Institute of Medical Sciences, Jaipur will find out whether clinical trials of @PypAyurved's 'Coronil' were done at all. An abundant warning to @yogrishiramdev that Maharashtra won't allow sale of spurious medicines. #MaharashtraGovtCares#NoPlayingWithLives
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 24, 2020
మంత్రి వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే రామ్‌దాస్ కదమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చికిత్స కోసం తయారు చేసిన ఔషధాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా నకిలీదని ఎలా తీర్మానిస్తారని ప్రశ్నించారు. బాబా రాందేవ్ ఎప్పటినుంచో దేశానికి సేవచేస్తున్నారని అన్నారు.
ఆవిష్కరణ- అంతలోనే...
కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు పతంజలి మంగళవారం ప్రకటించింది. 'కరోనిల్' పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పతంజలి సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కరోనిల్‌ను ఆవిష్కరించారు.
అయితే.. కరోనా మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు పతంజలి మీడియాలో ప్రకటించడాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని కోరింది. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని సూచించింది.
ఇవీ చదవండి