ETV Bharat / bharat

ముంబయి ఎప్పటికీ మాదే: పవార్‌ - lakshman savadi

ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్​ సవాడి వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్​ స్పందించారు. ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రకు చెందిన నగరమే అని వ్యాఖ్యానించారు.

mumbai, maharashtra, ajith pawar
ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రదే: పవార్‌
author img

By

Published : Jan 29, 2021, 6:30 AM IST

ముంబయి నగరం ఎప్పటికీ మహారాష్ట్రలో భాగమేనని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవార్‌ గురువారం మీడియాతో ఈ విధంగా స్పందించారు. 'ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రకు చెందిన నగరమే. ఈ నగరం నిన్న, నేడు, రేపు ఎప్పటికైనా మనదే. దాన్ని ఎవరూ మార్పు చేయలేరనే విషయం అందరికీ తెలుసు. కర్ణాటక డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని పవార్‌ స్పష్టం చేశారు.

'కర్ణాటకలోని మరాఠీ ప్రాంతాల విలీనానికి కట్టుబడి ఉన్నామంటూ.. ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు, ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సవాడి చేసిన డిమాండుకు మధ్య ఎలాంటి పొంతన లేదు. కేవలం కర్ణాటక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఏదో చిన్న ప్రయత్నంలో భాగంగా ముంబయి పేరును వాడుకున్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి’ అని పవార్‌ విమర్శించారు. సవాడి వ్యాఖ్యలపై మహారాష్ట్ర భాజపా నాయకులు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

భాజపా నేతల వైఖరి తెలపాలి..

ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్‌ తపసే సైతం ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం సవాడి వ్యాఖ్యలను మహారాష్ట్ర భాజపా నేతలు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర భాజపా చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్ ఈ విషయంలో తమ వైఖరి తెలపాలని డిమాండు చేశారు.

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి స్పందిస్తూ.. 'మా రాష్ట్రంలోని కొందరు ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందిన వారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి. అప్పటి వరకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా' అని సవాడి దీటుగా బదులిచ్చారు. అంతేకాకుండా సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : 'బాంబే హైకోర్టు తీర్పులు సరైనవి కావు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.