ETV Bharat / bharat

వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

author img

By

Published : Sep 14, 2020, 5:50 PM IST

తాము రూపొందించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసానిచ్చింది. లోక్​సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​... వీటి వల్ల రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని.. వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు, సాంకేతికత పెరుగుతాయని హామీనిచ్చారు. విపక్షాలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలన్నారు.

MSP will stay, farmers will get investment, technology: Govt on farm sector bills
వ్యవసాయ బిల్లుపై రైతులకు కేంద్రం భరోసా

వ్యవసాయ రంగానికి సంబంధించి లోక్​సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లుల వల్ల రైతులకు మంచే జరుగుతుందని కేంద్రం భరోసానిచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని.. వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుడులు, సాంకేతికత పెరుగుతాయని స్పష్టం చేసింది.

'ద ఫార్మర్స్​ ప్రొడ్యూస్​ ట్రేడ్​ అండ్​ కామర్స్​(ప్రమోషన్​ అండ్​ ఫెసిలిటేషన్​) ఆర్డినెన్స్​ 2020', 'ద ఫార్మర్స్​ (ఎంపవర్మెంట్​ అండ్​ ప్రొటెక్షన్​) అగ్రిమెంట్​ ఆన్​ ప్రైజ్​ అండ్​ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు, ద ఎస్సెన్షియల్ కమోడిటీస్ అమెండ్​మెంట్​ బిల్లు'లను లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఈ నేపథ్యంలో.. దేశంలో 86శాతం మంది రైతులకు రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉందని.. వీరు కనీస మద్దతు ధరల(ఎమ్​ఎస్​పీ) నుంచి లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. కొత్త బిల్లులు చట్టాలుగా మారితే... అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుందని, తమకు నచ్చిన పెట్టుబడిదారులతో రైతులు సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు

అదే సమయంలో ఎమ్​ఎస్​పీలు కొనసాగుతాయని సభకు మంత్రి హామీనిచ్చారు.

ఇదీ చూడండి:- వ్యవసాయ ఆర్డినెన్స్​లపై హరియాణా రైతుల ఆగ్రహం

మరోవైపు.. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతులకు భద్రతగా నిలిచే ఎమ్​ఎస్​పీ వ్యవస్థను ఈ బిల్లులు అణచివేస్తాయని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా ఈ బిల్లును ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నాయి.

దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి... రైతులు తమ సొంత పొలంలో పెట్టుబడులు పెట్టలేకపోతున్నారని, ఇతర మార్గల ద్వారా పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఈ బిల్లులు అన్నదాతలకు మంచి చేస్తాయన్నారు. విపక్షాలు కేంద్రంపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:- 'ఆ ఆర్డినెన్సులు వ్యవసాయ మృత్యు ఘంటికలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.