జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని రామ్‌పుర్ సెక్టర్ వద్ద ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కొందరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటాన్ని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ గుర్తించింది. గత నెల 30న జరిగిన ఈ ఘటనలో.. సరిహద్దుకు దగ్గరల్లో ఉన్న ఓ గ్రామం నుంచి దుండగులు భారత భూభాగంలోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి, పరికరాలను.. ఎల్ఓసీ వెంబడి ఉండే గుర్తుతెలియన స్థావరాల్లో వదిలి వేయడం వీరి పనిగా సైన్యం భావించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో తుపాకులను స్వాధీనం చేసుకుంది సైన్యం.
పాకిస్థాన్ సైన్యం సహాయంతోనే జమ్ముకశ్మీర్‌లోకి ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు ఉగ్రమూకలు చేస్తున్న దుశ్చర్యలకు ఈ తాజాగా ఘటన అద్దంపడుతోందని చినార్ కార్ప్స్ వెల్లడించింది. వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎల్ఓసీ వెంబడి పటిష్ట భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'