ETV Bharat / bharat

భర్తతో గొడవ... పిల్లలను చంపేసిన తల్లి - భర్తతో గొడవ

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో తీవ్రంగా గొడవపడిన ఓ మహిళ.. అనూహ్య రీతిలో తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగింది.

Mother kills two children, attempts suicide due to family dispute
భర్తతో గొడవ.. పిల్లలను చంపేసిన తల్లి
author img

By

Published : Sep 29, 2020, 8:14 AM IST

తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డ ఓ భార్య.. తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా అదే విధంగా అత్మహత్యకు పాల్పడింది.

కుటుంబ కలహాలు...

మిలవసల్​ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండి. ఐదేళ్ల క్రితం.. అదే ప్రాంతానికి చెందిన తమిళ్​సెల్వీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దంపతులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. 27వ తేదీ రాత్రి.. వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళ్​సెల్వీ అనూహ్యంగా తన పిల్లలు వర్ష శ్రీ, వర్ణిక శ్రీలపై కిరోసిన్​ పోసి నిప్పంటించింది. అనంతరం ఆమె కూడా అదే విధంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ చిన్నారులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయారు. కాలిన గాయాల ఉన్న తమిళ్​సెల్వీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేశారు. తమిళ్​సెల్వీ ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్తను పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- భార్యపై ఐపీఎస్​ దాడి​.. విధుల నుంచి సస్పెండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.