కేరళ మలప్పురం ప్రాంతం కొట్టకున్నులో కొండ చరియలు విరిగిపడి, ప్రాణం పోయినా కుమారుడి చెయ్యి వదల్లేదు ఓ తల్లి.
మలప్పురంలోని కొట్టకన్ను ప్రాంతం కొండలపై ఉంటుంది. ఇక్కడే నివాసముంటున్నారు గీతూ, శరత్ దంపతులు. శనివారం ఒక్కసారిగా వరద వచ్చి, కొండ చరియలు విరిగిపడగా... శరత్ సహా తల్లి సరోజిని, భార్య గీతూ, కుమారుడు ధ్రువ్ కొట్టుకుపోయారు.
ఆదివారం సహాయక సిబ్బంది చేసిన ఆపరేషన్లో బురద కింద 21 ఏళ్ల గీతూ, ఏడాదిన్నర వయస్సుండే ధ్రువ్ మృతదేహాలు బయటపడ్డాయి. మరణంలోనూ తన కుమారుడి చేతిని వదలకుండా గీతూ పట్టుకుని ఉన్న దృశ్యాలు చూసి స్థానికులు చలించిపోయారు.
సోమవారం శరత్ తల్లి సరోజిని మృతదేహం బయటపడింది. కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు అతడు.
ఇదీ చూడండి: రాజకీయ 'దంగల్'లోకి ఫొగట్ కుటుంబం