ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం! - తమిళనాడు నేర వార్తలు

తమిళనాడులో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారితో పాటు ఆ ఇంట్లో రెండు పెంపుడు శునకాలూ చనిపోయాయి.

Mother, daughter found hanging, kids and pets killed in TN
దారుణం- ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
author img

By

Published : Aug 24, 2020, 4:01 PM IST

తమిళనాడు తంజావూరులో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అదే ఇంటికి సంబంధించిన పెంపుడు జంతువులు కూడా మరణించాయి. బాధితుల్లో తల్లీకుమార్తెలు ఉరి వేసుకోగా.. మిగతా ఇద్దరు చిన్నారులు సహా శునకాలపై విషప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అసలేం జరిగింది?

పట్టకొట్టాయ్​కు చెందిన సకాదేవణ్​​(48) వలవణపురంలో నివసిస్తున్నారు. ఆయన ఇంట్లోనే శాంతి(50)తో పాటు కుమార్తె తులసీ దేవి(23), ఆమె ఇద్దరు కూతుళ్లు(రెండేళ్లు, ఎనిమిది నెలలు)ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నారు. వారితో పాటే రెండు పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి.

ఎప్పుడూ పిల్లల సందడితో హడావుడిగా ఉండే శాంతి కుటుంబం.. ఆగస్టు 23న అసలు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని సకదేవణ్​.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామ పరిపాలనాధికారి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తీయగా.. విగతజీవులుగా పడి ఉన్న ఆ కుటుంబ సభ్యుల్ని చూసి నివ్వెరపోయారు. పిల్లలు, కుక్కలకు విషమిచ్చి.. వారిద్దరూ ఉరి వేసుకుని ఉంటారని భావించారు పోలీసులు. అనంతరం ఆ మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ పూర్తి వ్యవహారంపై పట్టకొట్టాయ్​ పోలీస్​ స్టేషన్​ అధికారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అత్యాచారం చేసినోడితోనే బాలిక వివాహం.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.