కర్ణాటకలోని బళ్లారిలో అగ్ని ప్రమాదం జరిగింది. సంజీవరాయణ ఫోర్ట్ తాలూకాకు చెందిన ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లి, కుమార్తె మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి మంటలు భారీగా చెలరేగాయి. ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు తల్లి పార్వతి, కుమార్తె హులిగేగా పోలీసులు తెలిపారు.
కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లీకూతురే సిలిండర్‌కు నిప్పంటించి ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి: దుష్ప్రచారం అర్థరహితం.. జనం కోసమే జనగణన.!