ETV Bharat / bharat

ఆ శిబిరంలోనే అన్బళగన్​​కు కరోనా.. అధికారుల్లో గుబులు! - అన్బళగన్​ మృతి

కరోనా వైరస్​తో పోరాడుతూ బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజాసేవ కోసం క్షేత్రస్థాయిలో చాలా చురుకుగా పనిచేశారు అన్బళగన్​. ఇప్పుడు ఆయనను కలిసిన వారిని గుర్తించడానికి తమిళనాడు ప్రభుత్వానికి కష్టంగా మారింది. అంతేకాకుండా 25 మందికిపైగా పార్టీ నేతలకు వైరస్​ సోకినట్టు తెలుస్తోంది.

More than 25 DMK cadres surfers for COVID19.
ప్రజాసేవతోనే అన్బళగన్​కు కరోనా!
author img

By

Published : Jun 11, 2020, 9:32 AM IST

డీఎంకే నేత అన్బళగన్​ కరోనా వైరస్​తో మరణించడం తమిళనాడు వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయనకు అసలు కరోనా వైరస్​ ఎలా సోకింది? ఆయన నుంచి ఇంకెవరికైనా వైరస్​ వ్యాపించిందా? ఈ అనుమానాలు.. స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

అక్కడే వైరస్​ సోకిందా?

అన్బళగన్.. పశ్చిమ చెన్నై టీ.నగర్​లోని ఓ శిబిరానికి మే 27న వెళ్లారు. అక్కడున్న 1000 మందికి కూరగాయలు తదితర ఆహార సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపించింది. దీనిని నిర్లక్ష్యం చేసి ఆసుపత్రికి వెళ్లలేదు అన్బళగన్​. అనంతరం 29న జరిగిన ఓ పార్టీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. డీఎంకే నేత కరుణానిధి జన్మదిన వేడుకలపై చర్చించారు. దీని తర్వాత ఆయనకు దగ్గు, జ్వరం పెరిగినట్టు తెలుస్తోంది. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతుండటం వల్ల ఈ నెల 2న అన్బళగన్​ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.

More than 25 DMK cadres surfers for COVID19.
ఆహార సామాగ్రి అందిస్తూ

4వ తేదీన అన్బళగన్​ పరిస్థితి విషమించింది. వెంటనే ఆయనను వెంటిలేటర్​పైకి మార్చారు. తర్వాతి రోజే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. కానీ ఈ నెల 8న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

అన్బళగన్​ అంత్యక్రియలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన మరణం పట్ల విలపించారు. భౌతిక దూరం నిబంధనను లెక్కచేయలేదు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కుటుంబ సభ్యులు, పలువురు నేతలు కూడా హాజరయ్యారు.

అన్బళగన్​ ఫొటోకు స్టాలిన్​ నివాళి

వాళ్లనెలా పట్టుకోవాలి?

లాక్​డౌన్​ వల్ల ఎవరికీ సమస్యలు ఎదురవకూడదని క్షేత్రస్థాయిలో చురుకుగా పని చేశారు అన్బళగన్. అయితే ఇప్పుడు ఇదే తమిళనాడు ఆరోగ్య విభాగాన్ని కునుకుపట్టనివ్వకుండా చేస్తోంది. ఆయన ఎవరెవరిని కలిశారు, ఆయనతో ఎవరు సన్నిహితంగా ఉన్నారో గుర్తించడం వారికి చాలా కష్టంగా మారింది. ఇప్పటికే అన్బళగన్​ భార్య, కుమారుడు, కోడలికి కరోనా పాజిటివ్​గా తేలింది.​

మరోవైపు 25 మందికిపైగా డీఎంకే సభ్యులకు కరోనా సోకినట్టు సమాచారం. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.