వ్యవసాయ రంగంలో చేయాల్సిన సంస్కరణలు ఇంకా ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అందుకే ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు.. కేంద్రంతో చర్చలు జరపడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు తోమర్. ఎలాంటి సమస్య అయిన చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్నారు. చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయన్న ఆయన.. కేంద్రంతో మరోసారి చర్చించడానికి కర్షక సంఘాలు తేదీని ఖరారు చేయాలని కోరారు.
"రైతు సంఘాలు చర్చించుకుని తేదీ, సమయాన్ని నిర్ణయిస్తే మరోసారి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు" అని ఆశాభావం వ్యక్తం చేశారు తోమర్.
మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.. మరోమారు చర్చలకు కేంద్ర ప్రతిపాదనపై తమ నిర్ణయాన్ని తెలపలేదు. ఇప్పటికే ఐదుసార్లు రైతులతో కేంద్రం చర్చలు జరపినా.. ఓ కొలిక్కి రాలేదు.
ఇదీ చూడండి: దక్షిణేశ్వర్ మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతం