ప్రస్తుతం ఉత్తరాదిలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు తిరోగమించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఇవి వెనుదిరగనున్నాయని స్పష్టం చేసింది.
ఈ ఏట వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిశాయని తెలిపారు ఐఎండీ అధికారులు. సెప్టెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా 9 శాతం ఎక్కువే వానలు పడ్డాయని పేర్కొన్నారు.
''సెప్టెంబర్ 28 నుంచి పశ్చిమ రాజస్థాన్, పరిసర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.''
-వాతావరణ శాఖ
వర్షకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 96 నుంచి 104 శాతంగా ఉంటే దానిని సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు.
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 9 రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గుజరాత్, తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చూడండి: ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు
సిక్కింలో మాత్రం అతి భారీ వర్షాలు కురిశాయి. మరో 20 రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలుస్తోంది.
దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లో ఈసారి వర్షాలు.. సాధారణం కంటే తక్కువగా పడ్డాయి.
ఈ ఏడాది దేశంలో వర్షపాతం వివరాలు..
- జూన్లో సాధారణం కంటే 17 శాతం అధికం
- జులైలో 10 శాతం తక్కువ.
- ఆగస్టులో 27 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
భారతదేశంలో జూన్1-సెప్టెంబర్ 30 మధ్యకాలాన్ని వర్షాకాలంగా పరిగణిస్తారు. జూన్ 1న కేరళ మీదుగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.