దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఓ ప్రైవేట్ వాతవరణ సంస్థ తెలిపింది. 'లా నినా' పరిస్థితుల కారణంగా అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రుతుపవనాలు సహజంగా ప్రతి ఏడాది జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి.. ఒక రోజు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకుతాయని వెల్లడించింది వాతావరణ సంస్థ.
"ఈ రుతుపవనాల కాలంలో ఎల్నినో నుంచి లా నినా వైపు పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఫలితంగా అధిక వర్షాలు కురుస్తాయి."
-వాతవరణ సంస్థ.
ఈ అంచనాలు ఫలిస్తే.. దేశంలో వరుసగా రెండో సారి సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ సంస్థ పేర్కొంది.
ఇదీ చూడండి : దిల్లీలో ఒక్కరోజే 141 కొత్త కేసులు- 2 మరణాలు