కర్ణాటక చిత్రదుర్గ జిల్లా పర్యటక కేంద్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రాచీన కాలం నాటి చంద్రవల్లి గుహలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడ పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గుహల సమీపంలోని చంద్రవల్లి చెరువులో కోతులు ఈత కొడుతూ చేసే విన్యాసాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటి వింత చేష్టలతో వినోదాన్ని పంచుతున్నాయి.
ప్రస్తుతం భానుడి ఉగ్రరూపానికి మనుషులు, జంతువులు విలవిల్లాడిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఇక్కడి చెరువులో కోతులు ఈత కొడుతున్నాయి. చెరువులోని బండరాళ్లపై నుంచి దూకుతూ విన్యాసాలు చేస్తున్నాయి. పిల్ల కోతులకు ఈత నేర్పుతున్నాయి.
కోతులు చేసే వింత చేష్టలు ఉచిత వినోదాన్ని కలిగిస్తున్నాయంటున్నారు పర్యటకులు. ఇప్పటి వరకు అవి ఎవరికీ హాని చేయలేదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: తమిళనాడు నుంచి జపాన్‌కు 'నీటి' ఇంజిన్