ETV Bharat / bharat

'జేఈఈ, నీట్​ సిలబస్​లో మార్పు ఉండదు' - రమేశ్​ పోఖ్రియాల్

జేఈఈ, నీట్​ 2021 పరీక్షల సిలబస్​లో మార్పులు ఉండవని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అలాగే.. ఎన్​ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల్లో పలు సడలింపులు చేసినట్లు తెలిపింది.

Ramesh pokhrial
రమేశ్​ పోఖ్రియాల్​, కేంద్ర విద్యా శాఖ మంత్రి
author img

By

Published : Jan 19, 2021, 4:05 PM IST

2021లో జరగనున్న జేఈఈ, నీట్​ పరీక్షల సిలబస్​లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది కేంద్ర విద్యాశాఖ. జేఈఈ, నీట్​ పరీక్షల్లో అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్స్​ ఉంటాయని వెల్లడించింది. అలాగే.. నీట్​ 2021కు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది.

దేశవ్యాప్తంగా కొన్ని బోర్డులు సిలబస్​ను తగ్గించిన క్రమంలో నీట్​(యూజీ)2021 ప్రశ్నాపత్రంలోనూ జేఈఈ తరహాలో ఆప్షన్లు ఉండనున్నాయని స్పష్టం చేసింది.

నిబంధనల సడలింపు..

ఎన్​ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చింది కేంద్రం. ఇంటర్​లో 75 శాతం మార్కులు తప్పనిసరి చేసే నిబంధనను పూర్తిగా తొలగించింది.

Ramesh pokhrial
రమేశ్​ పోఖ్రియాల్​ ట్వీట్​

"ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్​), గత విద్యా సంవత్సరం కోసం తీసుకున్న నిర్ణయాలను పరిగణించి.. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్​లో 75 శాతం మార్కులు తప్పనిసరి నిబంధనను తొలగించాం. ఎన్​ఐటీలు, ఐఐఐటీలు, ఎస్​పీఏలు, ఇతర సీఎఫ్​టీఐల జేఈఈ(మేయిన్స్​) ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. "

- రమేశ్​ పోఖ్రియాల్​, కేంద్ర విద్యా శాఖ మంత్రి

నిబంధనల సడలింపుతో.. జేఈఈ మేయిన్స్​లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎన్​ఐటీలు ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో 12వ తరగతి బోర్డు పరీక్షల మార్కులను పక్కన పెట్టేస్తారు. గతంలో జేఈఈ మేయిన్స్​తో పాటు ఇంటర్​లో 75 శాతం మార్కులు లేదా టాప్​ 20 పర్సంటైల్​ను పరిగణనలోకి తీసుకునేవారు.

ఇదీ చూడండి: జేఈఈ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.