ETV Bharat / bharat

మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'

దేశ భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యం వహించేందుకు 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​'ను నియమించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవంనాడు ఎర్రకోట వేదికగా ఈ విషయం ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆర్టికల్​ 370 రద్దు, జనాభా విస్ఫోటనం, అభివృద్ధి సహా అనేక అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'
author img

By

Published : Aug 15, 2019, 1:46 PM IST

Updated : Sep 27, 2019, 2:24 AM IST

మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'

73వ స్వాతంత్ర్య దినోత్సవం దిల్లీ ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరిగింది. కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు ప్రధాని నరేంద్రమోదీ.

ఎర్రకోట వేదికగా వరుసగా ఆరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. 70 ఏళ్లల్లో ఎవరూ చేయలేని పనులను 70 రోజుల్లో పూర్తిచేసి... ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేసినట్లు వివరించారు.

మెరుగైన భద్రతకు సీడీఎస్​...

దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మోదీ. త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యానికి సంబంధించి 19ఏళ్లుగా ప్రతిపాదనగానే ఉన్న 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​' పదవిని సృష్టిస్తున్నట్లు వెల్లడించారు.

"యుద్ధం, ప్రజల రక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ నేను ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా అధ్యయనం జరిగింది. చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​(సీడీఎస్​)ను నియమించడానికి నిర్ణయించాం. తద్వారా త్రివిధ దళాలకు ఒక ప్రభావవంతమైన అధిపతి ఉంటారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప విషయం అవుతుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

'తప్పును సరిచేసే ధైర్యం లేకే...'

ఆర్టికల్​ 370 రద్దును తన ప్రసంగంలో ప్రస్తావించారు మోదీ. ఆ నిర్ణయంతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

"మేము సమస్యను సహించము, పెంచిపోషించము. ఆర్టికల్​ 370ని సమర్థిస్తూ ఏదో ఒకటి అంటున్నారు. దాన్ని సమర్థిస్తున్న వారిని దేశం ప్రశ్నిస్తోంది. ఆర్టికల్​ 370, 35ఏ ఎంతో గొప్పది, ఎంతో అవసరమైనది, కశ్మీర్​ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది అయితే... 70 ఏళ్లు గడిచినా వాటిని మీరు శాశ్వతం ఎందుకు చేయలేదు? తాత్కాలికంగానే ఎందుకు మిగిల్చేశారు? అంటే... ఈ విషయంలో మంచి జరగలేదని మీకు తెలుసు. కానీ తప్పును సరిచేసే ధైర్యం మీకు లేదనే కదా!"
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఒకే దేశం-ఒకే రాజ్యాంగం, ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం- ఒకే గ్రిడ్​ను ప్రస్తావిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేశారు మోదీ. ఒకే దేశం- ఒకే ఎన్నిక కల సాకారం దిశగా విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు.

నీటి పొదుపు... జనాభా విస్ఫోటనం

జలసంరక్షణ కోసం ప్రజలు ఉద్యమస్థాయిలో సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు 3.5 లక్షల కోట్ల రూపాయలతో 'జల్​ జీవన్​ మిషన్​'ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

ఆరేళ్లుగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నమోదీ... తొలిసారి జనాభా విస్ఫోటనంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాతో భావి తరాలకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయన్నారు. కుటుంబ నియంత్రణ కూడా దేశభక్తేనని అభిప్రాయపడ్డారు మోదీ.

మౌలిక వసతులు.. ఆర్థిక వ్యవస్థ

దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు ప్రధాని. 5 ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్య విధానంలో ప్రపంచ దేశాల్లో భారత్​ను తొలి 50లోపు ర్యాంకులో నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

'కుటుంబ నియంత్రణ కూడా దేశభక్తే...'

'తదుపరి లక్ష్యం... ఒకే దేశం- ఒకే ఎన్నిక'

'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT @davinchi.39st
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: EXPLETIVES AUDIBLE THROUGHOUT VIDEO++
++4:3++
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by @davinchi.39st
++Must on-screen credit to "@davinchi.39st"
Philadelphia - 14 August 2019
1. Various of crowds and police gathered at scene, police urge bystanders to stand back, bystanders realise shots are being fired at police
STORYLINE:  
A gunman who opened fire on police on Wednesday as they were serving a drug warrant in Philadelphia, wounding six officers and triggering a standoff that extended into the night, is in police custody, US authorities said.
Philadelphia police Sgt. Eric Gripp said early on Thursday morning that the man was taken into custody after an hours-long standoff with police.
The shooting began around 4:30 p.m. local time as officers went to a home in a north Philadelphia neighbourhood to serve a narcotics warrant in an operation "that went awry almost immediately," Philadelphia Police Commissioner Richard Ross said.
Many officers "had to escape through windows and doors to get (away) from a barrage of bullets," Ross said.
The six officers who were struck by gunfire have been released from hospitals, Gripp said.
Two other officers were trapped inside the house for about five hours after the shooting broke out but were freed by a SWAT team well after darkness fell on the residential neighbourhood. Three people that officers had taken into custody in the house before the shooting started were also safely evacuated, police said.
Police implored the gunman to surrender, at one point patching in his lawyer on the phone with him to try to persuade him to give up, Ross said.
Temple University locked down part of its campus, and several children and staff were trapped for some time in a nearby day care.
Police tried to push crowds of onlookers and residents back from the scene. In police radio broadcasts, officers could be heard calling for backup as reports of officers getting shot poured in.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 2:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.