ప్రాచీన కాలం నుంచి భారత్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని ఇండియా హౌస్‌ను సందర్శించారు మోదీ. అక్కడి భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"మన పూర్వీకులు ప్రజాస్వామ్య తత్వాన్ని బోధించారు. అందుకే మన దేశంలో ప్రజస్వామ్యం సమర్థంగా, వైవిధ్యంతో వెల్లివిరుస్తోంది. ఎన్నికలు అయిపోయిన వెంటనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు భారత్ అంతా ఏకమవుతుంది. ప్రతి భారతీయుడి కలను సాకారం చేస్తాం. అందుకే మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. దేశ అభివృద్ధికి మీరెంతో కృషి చేస్తున్నారు. మీకు మేము రుణపడి ఉంటాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: మోదీకి ఘన స్వాగతం పలికిన సింఘే