సార్వత్రిక ఎన్నికల్లో మెదటి విడత పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. భాజపా ప్రచార కార్యక్రమాలూ ఊపందుకున్నాయి. 'మోదీ హైతో ముమ్కిన్ హై' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించింది భాజపా.
ప్రధాని తాజాగా "మై బీ చౌకీదార్ (నేనూ కాపలాదారే)" అంటూ తన మద్దతుదారులకు ట్విట్టర్ వేదికగా దిశానిర్దేశం చేశారు. ఈ ప్రచారానికి సంబంధించిన 3 నిమిషాల వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు ప్రధాని. ఇందులో ఎన్డీఏ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించారు.
Your Chowkidar is standing firm & serving the nation.
— Narendra Modi (@narendramodi) March 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
But, I am not alone.
Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.
Everyone working hard for the progress of India is a Chowkidar.
Today, every Indian is saying-#MainBhiChowkidar
">Your Chowkidar is standing firm & serving the nation.
— Narendra Modi (@narendramodi) March 16, 2019
But, I am not alone.
Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.
Everyone working hard for the progress of India is a Chowkidar.
Today, every Indian is saying-#MainBhiChowkidarYour Chowkidar is standing firm & serving the nation.
— Narendra Modi (@narendramodi) March 16, 2019
But, I am not alone.
Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.
Everyone working hard for the progress of India is a Chowkidar.
Today, every Indian is saying-#MainBhiChowkidar
"మీ కాపలాదారు దృఢంగా నిలబడి దేశం కోసం సేవలందిస్తున్నాడు. కానీ ఒంటరిగా కాదు. అవినీతి, అపరిశుభ్రత, సామాజిక రుగ్మతులపై పోరాడే ప్రతీ ఒక్కరూ కాపాలాదారే... దేశాభివృద్ధికోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కాపలాదారే.. ప్రతి భారతీయుడు 'మై బీ చౌకీదార్' ప్రతిజ్ఞ చేయాలి."
-ట్విట్టర్లో ప్రధాని
'చౌకీదార్ చోర్ హై' అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీపై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు. రఫేల్ ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారని రాహుల్ ఆరోపిస్తున్నా... మోదీ 'చౌకీదార్' నినాదంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.