కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. వారికి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు వివరించనున్నారు. మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు దాదాపు 100 మందితో పాటు.. కొందరు కీలక మంత్రులూ హాజరుకానున్నారు. దిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి ఈ భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అజెండాను పంచుకోనున్నారు మోదీ. కొందరు ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలూ సేకరించనున్నారు.
2014లోనూ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన అనంతరం మోదీ.. ఇలాంటి సమావేశమే నిర్వహించారు. తర్వాత వివిధ సందర్భాల్లో మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
గత ప్రభుత్వ పరిపాలనలో సంస్కరణల కోసం కార్యదర్శులతో కూడిన 8 కమిటీలు ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతోనూ మోదీ సందర్భానుసారం సమావేశాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: