నేడు హరియాణాలో ఎన్నికల నగారాను మోగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోహ్తక్లో భాజపా విజయ్ సంకల్ప్ ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ర్యాలీకి సంబంధించిన పనులను భాజపా జాతీయ కార్యదర్శి అనిల్ జైన్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పర్యవేక్షిస్తున్నారు.
ర్యాలీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ప్రధాని. గురుగ్రామ్‌లో శ్రీ షీత్ల మాత దేవీ వైద్య కళాశాల, రోహ్తక్లో పారిశ్రామిక టౌన్‌షిప్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అక్టోబర్‌లో హరియాణాలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:- 'జల్ జీవన్‌కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'