ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ అభయారణ్యంలో సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సాహస యాత్ర ఎంతో ఆసక్తికరంగా సాగింది. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమం రికార్డుల మోత మోగించింది.
అయితే ఈ కార్యక్రమం చూసిన చాలా మందికి ఓ సందేహం కలిగింది. "బేర్ గ్రిల్స్‌కు హిందీ రాదు కానీ మోదీ మాట్లాడిన ప్రతి పదం ఎలా అర్థమైంది? ఇందులో రహస్యమేంటి?" వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ఈ విషయంపై స్పందించారు మోదీ.
"కొంతమందికి సందేహం ఉంది. 'మీరు హిందీ మాట్లాడారు.. ఆ భాష బేర్ గ్రిల్స్‌కు తెలియదు. మరి మీ ఇద్దరి మధ్య అంత వేగంగా సంభాషణ ఎలా జరిగింది? దీన్ని ఎడిట్ చేశారా? లేక పదేపదే షూట్ చేశారా?' అని నన్ను అడుగుతున్నారు. దీనిలో ఎలాంటి రహస్యం లేదు. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు ఈ రహస్యం గుట్టు విప్పాల్సిందే.
బేర్ గ్రిల్స్‌తో సంభాషణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాం. నేను ఏదైనా హిందీలో మాట్లాడితే.. అది వెంటనే ఆంగ్ల భాషలోకి అనువాదం అయ్యేది. గ్రిల్స్ చెవిలో చిన్నపాటి పరికరాన్ని అమర్చారు. నేను మాట్లాడింది హిందీ... కానీ గ్రిల్స్‌కు వినిపించింది ఆంగ్లం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
మోదీ పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. ఇందులో ఎన్నో విషయాలపై బేర్ గ్రిల్స్‌తో ముచ్చటించారు ప్రధాని. వీరి సాహసాలు నూతన రికార్డులు నెలకొల్పాయి. ఈ షో భారత్‌లో రికార్డు స్థాయి వీక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ట్రెండింగ్ టెలివిజన్ ఈవెంట్‌గా నిలిచినట్లు డిస్కవరీ ప్రకటించింది.
ఇవీ చూడండి:-